Sunday, June 14, 2026
HomeTrending Newsపోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది - మహేందర్ రెడ్డి

పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది – మహేందర్ రెడ్డి

పోలీస్ శాఖలో 36 సంవత్సరాలు  పని చేయడం సంతోషంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కి అభినందనలు తెలిపారు. అంజనికుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందని, తన సర్వీస్ లో హోమ్ గార్డ్ నుంచి పోలీస్ ఆఫీసర్ల వరకు సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ పోలీసు అకాడమీలో  డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామని, ఆపదలో ఉన్నవారికి పోలీసులున్నారనే నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థ  ఇచ్చిందన్నారు.

పోలీస్ శాఖలో పనిచెస్తున్న వారి జీతభత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని మహేందర్ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్సులు, హోమ్ కార్డులకు 20 వేల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని, ఇప్పటికే 27 వేల పోలీసులను రిక్రూట్ చేసుకోగా… త్వరలో మరో 17 వేల మంది పోలీస్ శాఖలో చేరనున్నారని వెల్లడించారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నో కేసులు పరిష్కరించామన్నారు. రానున్న రోజుల్లో నేరాలన్ని డిజిటల్ రూపంలో జరుగుతాయి.. కాబట్టి పోలీసులందరూ టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని సూచించారు. విజనరీ దృష్టిలో ఉంచుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular