Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  టైటాన్స్ ను వెంటాడిన దురదృష్టం

ప్రొ కబడ్డీ:  టైటాన్స్ ను వెంటాడిన దురదృష్టం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ ఈ సీజన్లో  తెలుగు టైటాన్స్ ను దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. నేడు జరిగిన మ్యాచ్ లో కూడా ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. నేటి మరో మ్యాచ్ లో పునేరి పల్టాన్ విజయం సాధించింది.

పునేరి పల్టాన్- గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో పూణే 33-26తో   విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 19-13 తో ఆధిక్యం సంపాదించిన పూణే రెండో అర్ధ భాగంలోనూ 14-13 తో పైచేయి సాధించి మొత్తంగా ఏడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

తెలుగు టైటాన్స్- దబాంగ్ ఢిల్లీ  మధ్య జరిగిన  రెండో మ్యాచ్ లో ఢిల్లీ 36-35 తో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో రెండు జట్లూ 18-18 తో సమంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలో 18-17 తో ఢిల్లీ జట్టు ఆధిక్యం సంపాదించి మ్యాచ్ ను గెల్చుకుంది. ఢిల్లీ ఆటగాడు నవీన్ కుమార్ 25 (15 టచ్, 10బోనస్) పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఢిల్లీ టాప్ ప్లేస్ కు చేరుకుంది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (26 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (23) పాట్నా పైరేట్స్ (21); యూ ముంబా(20); తమిళ్ తలైవాస్ (19); బెంగాల్ వారియర్స్ (16); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: తమిల్ తలైవా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్