ఐటి నోటీసులపై చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రారశ్మనించారు. 2022 నుంచి ఈ ఏడాది జూన్ వరకు నాలుగుసార్లు సమాధానం చెప్పినా సంబంధిత విషయంపై కాకుండా, సాంకేతిక అంశాలు ప్రసావించారని, జ్యూరిస్‌డిక్షన్ కాదని ఒకసారి, తగిన మెటేరియల్ లేకుండానే ప్రశ్నలు అడిగారంటూ మరోసారి వివరణ ఇచ్చారని సజ్జల ప్రస్తావిచారు. ఎప్పటికప్పుడు ఏదో సాకు చెబుతూ పోయాడు తప్ప, ఐటీ శాఖ స్పష్టంగా అడిగిన రూ. 118.98 కోట్లకు లెక్కలు మాత్రం చెప్పలేదన్నారు. ‘చంద్రబాబుది ఎప్పుడైనా అదే వైఖరి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యవస్థల మేనేజ్‌మెంట్‌తోనే గడిపాడు. చాలా కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు’ అని వ్యాఖ్యానించారు.
“చంద్రబాబునాయుడు అవినీతి వ్యవహారంపై నిన్న, ఈరోజు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నా యి. ఆయన పదవిలో ఉన్నప్పుడు కొందరికి కాంట్రాక్ట్‌లు ఇచ్చి, షెల్ కంపెనీల ద్వారా కిట్ బ్యాగ్స్ ఎలా తీసుకున్నారనే దాన్ని సాక్ష్యాధారాలతో సహా, ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన కధనాలు వచ్చాయి. ఆ నోటీసు చూసినట్లు కూడా ఆ కధనాల్లో రాశారు. నిన్న హిందుస్తాన్ టైమ్స్‌లో స్టోరీ వస్తే, ఈరోజు డెక్కన్ క్రానికల్‌లో ఆ నోటీసు స్కాన్ కాపీతో సహా స్టోరీ వేశారు. ఆ నోటీసుపై సమాధానం చెప్పాలని నిన్న మా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు నోటీసు స్కాన్ కాపీ కూడా బయటకు వచ్చింది. కనీసం ఇప్పుడైనా టీడీపీ నేతలు స్పందిస్తారా? దానిపై మాట్లాడతారా?” అని సజ్జల నిలదీశారు.