25.7 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeTrending NewsOne Nation-One Election: అన్నిటికీ పరిష్కారం కాదు: సజ్జల

One Nation-One Election: అన్నిటికీ పరిష్కారం కాదు: సజ్జల

ఐటి నోటీసులపై చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రారశ్మనించారు. 2022 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు నాలుగుసార్లు సమాధానం చెప్పినా  సంబంధిత విషయంపై కాకుండా, సాంకేతిక అంశాలు ప్రసావించారని, జ్యూరిస్‌డిక్షన్‌ కాదని ఒకసారి, తగిన మెటేరియల్‌ లేకుండానే ప్రశ్నలు అడిగారంటూ మరోసారి వివరణ ఇచ్చారని సజ్జల ప్రస్తావిచారు. ఎప్పటికప్పుడు ఏదో సాకు చెబుతూ పోయాడు తప్ప, ఐటీ శాఖ స్పష్టంగా అడిగిన రూ. 118.98 కోట్లకు లెక్కలు మాత్రం చెప్పలేదన్నారు. ‘చంద్రబాబుది ఎప్పుడైనా అదే వైఖరి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యవస్థల మేనేజ్‌మెంట్‌తోనే గడిపాడు. చాలా కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు’ అని వ్యాఖ్యానించారు.

“చంద్రబాబునాయుడు అవినీతి వ్యవహారంపై నిన్న, ఈరోజు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నా యి. ఆయన పదవిలో ఉన్నప్పుడు కొందరికి కాంట్రాక్ట్‌లు ఇచ్చి, షెల్‌ కంపెనీల ద్వారా కిట్‌ బ్యాగ్స్‌ ఎలా తీసుకున్నారనే దాన్ని సాక్ష్యాధారాలతో సహా, ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన కధనాలు వచ్చాయి. ఆ నోటీసు చూసినట్లు కూడా ఆ కధనాల్లో రాశారు. నిన్న హిందుస్తాన్‌ టైమ్స్‌లో స్టోరీ వస్తే, ఈరోజు డెక్కన్‌ క్రానికల్‌లో ఆ నోటీసు స్కాన్‌ కాపీతో సహా స్టోరీ వేశారు. ఆ నోటీసుపై సమాధానం చెప్పాలని నిన్న మా పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈరోజు నోటీసు స్కాన్‌ కాపీ కూడా బయటకు వచ్చింది. కనీసం ఇప్పుడైనా టీడీపీ నేతలు స్పందిస్తారా? దానిపై మాట్లాడతారా?” అని సజ్జల నిలదీశారు.

వన్‌ నేషన్‌. వన్‌ ఎలక్షన్‌. అంత అత్యవసరం కాదని సజ్జలఅభిప్రాయపడ్డారు. “మొదట్లో అలాగే జరిగాయి. ఆ తర్వాతే పరిస్థితి మారింది. జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిన తర్వాత.. రాష్ట్రాల్లో పూర్తిస్థాయ ప్రభుత్వాలు కొనసాగక, ఎన్నికల షెడ్యూల్‌ మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల నిర్వహణ అత్యంత వ్యయంతో కూడుకుంది. అన్ని సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారం అనుకోవడం కూడా సరికాదు. ఇంకా వేరే సమస్యలు చాలా ఉన్నాయి.” అన్నారు.
“అమెరికా వంటి దేశంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. చాలా పార్టీలు ఉన్నాయి. అందుకే దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. ఏకాభిప్రాయం రావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ కూడా చాలా వ్యయంతో కూడుకున్నది కాబట్టి.. మార్పు దిశగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లోపే అది జరుగుతుందని అనుకోవడం లేద”న్నారు సజ్జల.

 

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్