ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి ‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం’ గా పేరు ఖరారు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం’ పై గృహనిర్మాణశాఖ అధికారులతో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు. పథకం అమలు తీరుపై అధికారులు సిఎంకు వివరించారు.
⦿ సెప్టెంబరు 25 నుంచి డేటాను అప్‌లోడ్ చేయనున్న ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
⦿ వివిధ సచివాలయాలకు ఈ డేటాను పంపనున్న అధికారులు
⦿ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్న సిబ్బంది
⦿ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హులైన వారి జాబితాలు
⦿ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఒన్‌టైం సెటిల్‌మెంట్‌పథకం సొమ్మను చెల్లించేలా వెసులుబాటు
⦿ రుసుము చెల్లించిన వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు
⦿ ఒన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు తెలిపిన అధికారులు
⦿ ఓటీఎస్ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలన్న సీఎం
పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష
⦿ ఇప్పటివరకూ గ్రౌండ్ అయిన ఇళ్లు 10.31 లక్షలు
⦿ ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
⦿ ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం
⦿ ఆప్షన్ 3కింద కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు
⦿ ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకు పైగా గ్రూపులు ఏర్పాటు చేసిన అధికారులు
⦿ ఇళ్లనిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను
⦿ దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయన్న అధికారులు
⦿ మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్ పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.