Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్SL-PAK: కొలంబో టెస్టుకూ వర్షం అడ్డంకి

SL-PAK: కొలంబో టెస్టుకూ వర్షం అడ్డంకి

శ్రీలంక- పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టుకూ వర్షం అంతరాయం కలిగించింది. ఈ వారం యాషెస్ నాలుగో టెస్ట్, ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

కొలంబో లోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో సోమవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య శ్రీలంక 166 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో ధనుంజయ డిసిల్వా- 57; చందీమల్-34; ఆర్ మెండీస్-27; కెప్టెన్ కరుణ రత్నే-17 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4; నషీమ్ షా 3; షహీన్ ఆఫ్రిది 1 వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాక్ తొలి రోజు 28.3  ఓవర్లు ఆడి 2 వికెట్లు కోల్పోయి145  పరుగులు చేసింది.  ఓపెనర్ ఇమాం ఉల్ హక్ కేవలం 6 పరుగులే చేసి ఔట్ కాగా, షాన్ మసూద్ అర్ధ సెంచరీ(51)  చేసి వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లూ అసిత ఫెర్నాండో కే దక్కాయి.

నేడు రెండోరోజు కేవలం 10 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది. భారీ వర్షం కారణంగా ఆట నిలిచి పోయింది. ఈ సమయానికి పాక్  2 వికెట్లకు 178 చేసింది.

ఓపెనర్ అబ్దుల్లా సిద్దిఖి-87;  కెప్టెన్ బాబర్ అజామ్-28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ 12 పరుగుల ఆధిక్యంతో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్