Wednesday, May 7, 2025
HomeTrending Newsసంక్షేమం వద్దంటారా? మేరుగ ప్రశ్న

సంక్షేమం వద్దంటారా? మేరుగ ప్రశ్న

Welfare State: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.  కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా రంజకమైన ఈ సంక్షేమ పథకాలే నిరుపేద ప్రజలను ఆదుకున్నాయని, కంటికి రెప్పలా కాపాడాయని అన్నారు.  పేదలకు మేలు చేయడమే తమ ప్రభుత్వం చేస్తున్న నేరమా అని అడిగారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో చేసిన దుర్మార్గాలు ఇంకా గుర్తున్నాయని, కానీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ప్రతి  స్కీమునూ లబ్ధిదారుల ఇళ్ళవద్దకే వెళ్లి అందిస్తుంటే చూసి ఓర్వలేక కొంతమందికి కళ్ళలోనుంచి నీరు బదులు రక్తంకారుతోందని నాగార్జున మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది డబ్బులు పంచడం కాదని, సంస్కరణ అని వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం సిఎం జగన్  అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, చేయూత, ఆసరా,  పెన్షన్లు, జగనన్న ఇళ్ళ పట్టాల పథకం అమలు చేస్తుంటే ఇవన్నీ ఆపేయాలని వారి ఉద్దేశమా అని మేరుగ ప్రశ్నించారు. లక్షలాది మంది లబ్ధి దారులకు కోట్లాది రూపాయలు  అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వీటిని ఆపేయాలని వారు భావిస్తున్నారా అని నిలదీశారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై నేడు ఓ దిన పత్రికలో ప్రచిరితమైన వార్తా కథనాన్ని,  ఈ విషయమై విశ్రాంత ఐఏఎస్ అధికారులు వెలిబుచ్చిన అభిప్రాయాలను మంత్రి తప్పుబట్టారు.

ఇటీవలి  మంత్రివర్గంలో  68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించారని, కానీ బాబు తన హయంలో 45 శాతం మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. సామాజిక విప్లవానికి  నాంది పలికి , పూలే ను గుర్తుకు తెచ్చేలా పాలన చేస్తుంటే కొందరికి కడుపు మంటగా ఉందని మేరుగ అన్నారు. ఇప్పటికైనా సంక్షేమానికి అడ్డు తగిలే పనులు మానుకోవాలని  చంద్రబాబుతో పాటు, విపక్షాలు,  మీడియాకు హితవు పలికారు.

Also Read : కేంద్రం జోక్యం చేసుకోవాలి: గోరంట్ల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్