Friday, April 19, 2024
HomeTrending Newsరోగి సహాయకులకు 5.రూ భోజనం - మంత్రి హరీష్

రోగి సహాయకులకు 5.రూ భోజనం – మంత్రి హరీష్

Five Rupees Meal : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు ఇబ్బందులు ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఐదు రూపాయల భోజనం అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు, సహాయకులుగా వచ్చే వారికి ప్రభుత్వం 5 రూపాయలకే నాణ్యమైన చక్కటి భోజనం అందుబాటులోకి రానుంది. ఇవాళ దీనికి సంబంధించి హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం తరపున టీఎస్ఎంఎస్ఐడీసీ , స్వచ్ఛంధ సంస్థ హరె కృష్ణ మూమెంట్ సంస్థ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. రోగి సహాయకులకు ఐదురూపాయలకే శుధ్దమైన ఙోజనం మూడు పూటలా ప్రభుత్వం అందించనుంది. జీహెచ్ఎంసీ లో 5 రూపాయలకే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇప్పటికే పేదలకు ఎలా భోజన సౌకర్యం అందిస్తున్నామో, అదేరీతిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఈ సౌకర్యం కలగనుంది.

ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబర్ రైస్ తోపాటు పచ్చడి బ్రేక్ ఫాస్ట్ గా అందిస్తారు. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ గా అన్నం, సాంబర్ లేదా పప్పు, పచ్చడి, సబ్జీ వంటివి వడ్డిస్తారు. డిస్పోజబుల్ ప్లెట్, వాటర్ గ్లాస్ సైతం అందించబడుతుంది. రోగి సహాయకులు ప్లెట్ భోజనానికి 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తే, ప్రభుత్వం హెరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ కు మిగతా మొత్తం 21.25 రూపాయలు చెల్లిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ, నీలోఫర్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి, ఎం,ఎన్. జే క్యాన్సర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, కోటి ఈఎన్.టీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, కోటి మెటర్నటీ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్, కింగ్ కోటి జిల్లా ఆస్పత్రి, మలక్ పేట ఎం.ఎన్ ఏరియా ఆస్పత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, కోండాపూర్ ఏరియా ఆస్పత్రి, నాపల్లి ఏరియా ఆస్పత్రుల్లో ఐదు రూపాయల భోజన సౌకర్యం కల్పించనున్నాం.

ఈ రాయితీ భోజనం హైదరాబాద్ లోని 18 ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు పెట్టేందుకు ప్రభుత్వం 38.66 కోట్లు ఏటా ఖర్చు చేయనుంది. దాదాపు 20 వేల మందికి ఈ భోజన సదుపాయం కలగనుంది. మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చద్దిమూట పేరుతో రైతులకు, పాఠశాల విద్యార్థులకు సంగారెడ్డిలో మధ్యాహ్న భోజనం ఉచితంగా పెట్టడం జరిగిందని. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా లైబ్రరీ విద్యార్థులకు పెడుతున్నం. హైదరాబాద్ తరహాలో సిద్దిపేట, సంగారెడ్డిలో 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం పెట్టినమని మంత్రి చెప్పారు. వారం పది రోజుల్లో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసి, జంటనగరాల్లోని 18 ఆసుపత్రుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేసి ఒకే సారి ప్రారంభించడం జరుగుతుందని మంత్రి చెప్పారు.

ఈ కార్యకమ్రంలో హరె కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో శ్రీమాన్ కాంతేయ దాస ప్రభు, శ్రీమాన్ ధనుంజయ దాస ప్రభు, టీఎస్ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నరు.

Also Read : వైద్యానికి బడ్జెట్ లో భారీ నిధులు: హరీష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్