Friday, April 19, 2024
HomeTrending Newsకాబుల్ పాఠశాలల్లో పేలుళ్లు, 25 మంది మృతి

కాబుల్ పాఠశాలల్లో పేలుళ్లు, 25 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో సుమారు 25 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు. రాజధాని కాబుల్ లోని పశ్చిమ ప్రాంతంలో మొదటగా ఓ పాఠశాలలో బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కాబుల్ నగర సమీపంలోని దస్త్-ఏ-బర్చి జిల్లాలోని మరో స్కూల్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. ఈ పాటశాలలో వరుసగా మూడుసార్లు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రెండు పాఠశాలల్లో జరిగిన పేలుళ్ళ ధాటికి చనిపోయినవారిలో ఎక్కువమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులే ఉన్నారు.

వరుస పేలుళ్లతో కాబుల్ లో హై అలెర్ట్ ప్రకటించారు. పేలుళ్లకు కారణమా ఎవరన్నది తెలియరాలేదు. ఇటీవలి కాలంలో బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. మహిళల హక్కులు, బాలికల విద్య, మానవ హక్కుల పరిరక్షణ చేపడితేనే అంతర్జాతీయ సాయం అందుతుందని పశ్చిమ దేశాలు స్పష్టం చేశాయి. వీటితోపాటు మైనారిటీల హక్కులు కాపాడినపుడే తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తామని అమెరికా, నాటో దేశాలు తెగేసి చెప్పాయి.

Also Read : అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38మందికి మరణశిక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్