Sunday, March 15, 2026
Homeసినిమావర్జిన్ స్టోరి యూత్ కు బాగా క‌నెక్ట్ అయ్యింది : లగడపాటి శ్రీధర్

వర్జిన్ స్టోరి యూత్ కు బాగా క‌నెక్ట్ అయ్యింది : లగడపాటి శ్రీధర్

Youth connected: ప్ర‌ము నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన‌ సినిమా వర్జిన్ స్టోరి. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ అనేది ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకం పై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్నినిర్మించారు. సౌమిక పాండియన్ నాయికగా నటించింది. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన “వర్జిన్ స్టోరి” సినిమా యూత్ ఆడియ‌న్స్ ని బాగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం తెలిపారు. హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ “వర్జిన్ స్టోరి చిత్రంతో ఒక కొత్త ప్రయత్నం చేశామని అభినందిస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యత చూపించలేదు అని ప్రశంసిస్తున్నారు. యూఎస్ నుంచి మిత్రులు కాల్ చేసి అభినందిస్తున్నారు. యూత్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయ్యింది.  సినిమాకు విజయాన్ని అందించి మమ్మల్ని మా టీమ్ ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు” అంటూ స్పందన తెలియజేశారు.

దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ “క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేశాం. యూత్ నుంచి రెస్పాన్స్ బాగుంది. కామెడీలో చాలా రకాలు ఉంటాయి. మేము విభిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ ఇద్దామని ప్రయత్నించాం. మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియెన్స్ నుంచి ఇంకా మంచి స్పందన ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular