Monday, January 20, 2025
HomeTrending Newsఅవినీతి నిరూపిస్తే కాళ్ళు పట్టుకుంటా: నారాయణ స్వామి

అవినీతి నిరూపిస్తే కాళ్ళు పట్టుకుంటా: నారాయణ స్వామి

పార్టీలో తనపై కుట్ర జరుగుతుందని, ఒక వ్యక్తీ తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం గంగాధర నెల్లూరు లోని ఓ మండలంలో ఈ కుట్రకు తెరతీశారని, తనకు వ్యతిరేకంగా పలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని,  తాను అవినీతి చేశానని ఎవరైనా నిరూపిస్తే తాను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటానని శపథం చేశారు. తనను అవమానించిన విషయం బైటకు వెల్లడిస్తే ఏం జరుగుతుందో ఆ నాయకుడికి తెలియడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయిలో ఓ ముఖ్య హోదాలో ఉన్న నేత దీనివెనుక ఉన్నారని ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారు పదవులు వదిలి వెళ్లాలని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్