Tuesday, April 16, 2024
HomeTrending Newsఅన్ని దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు: మంత్రి

అన్ని దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు: మంత్రి

Online:  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు మాసాంతానికల్లా ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం తమ ఛాంబరులో మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో ఎటు వంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా టి.టి.డి. తరహాలో అన్ని రకాల సేవలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ శాఖ పరిధిలోని ఎనిమిది ప్రధాన దేవాలయాలు, 6(ఎ)  కేటగిరీలోని 180 దేవాలయాల్లో అన్నిరకాల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, రూముల బుకింగ్ తదితర సేవలన్నింటినీ  డిజిటలైజ్ చేసి భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఆయా దేవాలయాల్లో జరిగే ఆర్థిక లావాదేవీల ఖాతాలు అన్నింటినీ అన్ లైన్ ద్వారా ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను కూడా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు.

కోటి రూపాయలలోపు ఆదాయంగల  ఐదు దేవాలయాలు  కోటబొమ్మాళి కొత్త అమ్మవారి దేవాలయం, శాండ్ హిల్ రామ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, విశాఖపట్నం వెలంపేట దుర్గాలమ్మవారి దేవాలయం, పొన్నూరు భావన్నారాయణ స్వామి దేవాలయం, ఆరుగొండ అర్థగిరి వీరాంజనేయ స్వామి దేవాలయాలకు ధార్మిక పరిషత్ కమిటీ ద్వారా ట్రస్టు బోర్డులను ఏర్పాటు చేశామని వివరించారు

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాలకు సంబంధించి దాదాపు  6  లక్షల ఎకరాల దేవాదాయ భూముల ఉన్నాయని, వాటిలో 2 లక్షల ఎకరాలు అర్చకుల  యాజమాన్యంలో ఉన్నాయని,  మరో 2 లక్షల ఎకరాలు పలు లిటిగేషన్లలో ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దేవాదాయ భూముల ఆక్రమణను పటిష్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్ట సవరణకు చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలోనే ఆప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్