Saturday, May 11, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వంశపారంపర్య హక్కులు అమలు చేయండి

వంశపారంపర్య హక్కులు అమలు చేయండి

రాష్ట్రంలో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చొరవ చూపాలని, వంశపారంపర్య హక్కులను అమలు చేయాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ రిషికేష్ వెళ్ళి చాతుర్మాస్య దీక్ష చేపట్టిన స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తరాదికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములను కలిశారు. పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. స్వాత్మానందేంద్ర స్వామి చేతులమీదుగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరులకు నిర్వహించిన పీఠపూజలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల దేవాదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన మార్పులను స్వామి స్వరూపానందేంద్రకు వివరించారు. ఈ సందర్బంగా అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్ కు స్వామీజీ సూచించారు.

కోవిడ్ నేపధ్యంలో ఆన్‌లైన్ ద్వారా పూజలు, వ్రతాలు చేపట్టడం ద్వారా మంచి స్పందన వచ్చిందని, దేవాదాయశాఖకు ఆదాయం పెరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ స్వామీజీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ చర్యలను స్వామీజీ ప్రశంసించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలని స్వామీజీ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్