Monday, May 20, 2024
HomeTrending Newsబీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు అధికార యావ

బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు అధికార యావ

తోడేళ్ళలాగా బీజేపీ,కాంగ్రెస్ వాళ్లు తెలంగాణపై  దాడి చేస్తూ, అనైతిక విమర్శలు చేస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా అత్యుత్తమ జీవనప్రమాణాలతో జీవిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పులు కుప్పగా మార్చిందని గుత్తా ఆరోపించారు. నల్గొండలో మీడియా సమావేశం నిర్వహించిన శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి,ప్రజల జేబుకు చిల్లు పెట్టారు బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ నేతలు  బ్రమల్లో ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణ లో అమలు అవుతున్న ఒక్క పథకమైన ఉందా చెప్పాలని ప్రశ్నించారు.

కరోన సెకండ్ వేవ్  కట్టడిలో బీజేపీ మోడీ సర్కార్ అట్టర్ ప్లాప్ అయ్యింది.ఇంకా నీతులు మాట్లాడితే ఎలా,ఈటెల రాజేందర్  అసైన్డ్ ల్యాండ్ లను తీసుకున్న అని ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి ని ఎలా పార్టీలో చేర్చుకున్నారు.సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ వాళ్లు దళితులకు చేసింది ఏమి లేదు.ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని గుట్ట ఎద్దేవా చేశారు. నూరు శాతం తెలంగాణలో  సామాజిక న్యాయం  అమలు అవుతున్నదని, ఒకలక్ష 38 వేల ప్రభుత్వ  ఉద్యోగులను ప్రభుత్వం ఇచ్చింది, మరో 50 వేల ఉద్యోగాలను త్వరలోనే ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు  అధికార యావ తప్ప వేరే ఆలోచన లేదని విమర్శించారు. హుజురాబాద్ లో ముమ్మాటికి గులాబీ జెండానే ఎగురుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ప్రజలు ఆదరిస్తారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్