He is the reason: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను బిజెపికి చెందిన రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. అయన వల్లే కేంద్ర హోం శాఖ కమిటీ సమావేశం అజెండా నుంచి హోదా అంశాన్ని తొలగించారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని తెలంగాణా సిఎం కేసిఆర్ కూడా చెప్పిన విషయాన్ని భరత్ గుర్తు చేశారు. రాజమండ్రిలో నేడు మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై 22 మంది వైసీపీ ఎంపీలం అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడామన్నారు, తాము మాట్లాడడం వల్లే ప్రధాని తన ప్రసంగంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిచ్చారని వివరించారు.
ప్రత్యేకహోదా అంశాన్ని తాకట్టు పెట్టి కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అంటూ మహిళలను చంద్రబాబు అవహేళన చేశారని, ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని టిడిపి మహిళలు దీక్షలు చేస్తున్నారని భరత్ ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2,100 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చెయ్యాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదార్లు మంజూరు చేసినందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న భరత్, ఈ విషయంలో క్రెడిట్ తమకు అక్కరలేదన్నారు.
Also Read : ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్: విజయసాయి