Saturday, April 20, 2024
HomeTrending Newsఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్: విజయసాయి

ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్: విజయసాయి

No Viswas- No prayaas: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్ –  పేషెంట్ డేడ్ అన్న చందంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి  వ్యాఖ్యానించారు. ఎగువ సభలో 2022-23 కేంద్ర బడ్జెట్ పై జరిగిన చర్చలో అయన  మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో  ప్రారంభించిన కేంద్ర సంస్థలన్నీ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, నాడు కాంగ్రెస్ పార్టీ లోప భూఇష్టంగా విభజన చట్టాన్ని తయారు చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని అలుసుగా తీసుకొని రాష్త్రానికి అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకుంటే ఇది మంచి బడ్జెట్ అయి ఉంటుందేమో కానీ ఆంధ్ర ప్రదేశ్ కోణంలో చూసినప్పుడు ఇది నిరర్ధక బడ్జెట్ అన్నారు.

మోడీ ప్రభుత్వం మొదట్లో ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ‘ నినాదం ఇచ్చిందని, దానికి ప్రతి ఏడాదీ ఒక్కో వాక్యం చేరుస్తున్నారని, ఇప్పుడు సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అని  కలిపారని అయితే ఈ బడ్జెట్  ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల విషయంలో సాత్, వికాస్, విశ్వాస్, ప్రయాస్ పాటించడం లేదని వ్యంగ్యాస్త్రం సంధించారు.

కేంద్ర బడ్జెట్ లో పస లేదన్నారు. ఆత్మా నిర్భర్ భారత్ అంటున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆత్మ నిర్భర్ పై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.  రాష్ట్రాలకు పన్నుల వాటా సరిగా పంచడం లేదని, ఇష్టానుసారం సెస్, సర్ ఛార్జీలు పెంచుతున్నారని విమర్శించారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పన్నుల వాటా పెంచాలని, పన్నుల ఫైలింగ్ విధానాన్ని సరళీకృతం చేయాలని సూచించారు.

2010-15 ఏపీ పన్నుల వాటా 6.9 శాతంగా ఉండేదని, 2015-20 నాటికి ఇది 4.3 శాతానికి పడిపోయిందని  వివరించారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయంపై 5.9 శాతం నిధులు వెచ్చిస్తుండగా, కేంద్రం 3.9 శాతం మాత్రమేనని, విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చు  చేస్తుండగా,  కేంద్రం ఖర్చు చేస్తున్నది 2.6 శాతం మాత్రమేనన్నారు.

ఇవి కూడా చదవండి: ఎందుకు సాధ్యం కాదు? :విజయసాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్