Monday, March 9, 2026
HomeTrending Newsకాంస్యం దక్కించుకున్న సింధు

కాంస్యం దక్కించుకున్న సింధు

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి. సింధు కాంస్యం గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ లో మూడో స్థానం (కాంస్య పతకం) కోసం నేడు జరిగిన మ్యాచ్ లో సింధు, చైనా కు చెందిన జింగ్ జియావో తో తలపడింది. 21-13, 21-15 తేడాతో సింధు గెల్చుకుంది.

జియావో కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ సింధు మెరుగైన ఆట తీరు ప్రదర్శించి పైచేయి సాధించింది.  నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో చైనా థైపీస్ క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైన సింధు నేడు తేరుకొని మన దేశానికి కాంస్యం తీసుకు వచ్చింది. గత ఒలింపిక్స్ లో రజత పతకం గెల్చుకున్న సింధు ఈసారి కాంస్యం పతకం గెల్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular