Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రీ క్వార్టర్స్ కు పి.వి. సింధు

ప్రీ క్వార్టర్స్ కు పి.వి. సింధు

ఇండియన్ షటిల్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్ లో కూడా విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్ళారు. నేడు జరిగిన గ్రూప్ ‘జే’ మ్యాచ్ లో హాంకాంగ్ క్రీడాకారిణి చెంగ్ ఈ నాన్ పై 21-9, 21-16 తేడాతో విజయం సాధించి గ్రూప్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

మొత్తం ‘ఏ’ నుంచి ‘పి’ వరకూ మొత్తం 16 గ్రూపుల నుంచి ఒక్కొకరు చొప్పున మొత్తం 16 మంది తర్వాతి రౌండ్ కు చేరుకుంటారు. వీరిలో ఎనిమిది మంది క్వార్టర్స్ కు, వీరి నుంచి నలుగురు సెమి ఫైనల్స్ కు చేరుకుంటారు. ఆగస్టు 1న  ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్