Saturday, January 18, 2025
Homeసినిమాబిర్సా ముండాపై పా రంజిత్ సినిమా

బిర్సా ముండాపై పా రంజిత్ సినిమా

సామాజిక అంశాలపై చిత్రాలు తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న దర్శకుడు పా రంజిత్ త్వరలో  బిర్సా ముండా జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత తో  కబాలి, కాలా లాంటి హిట్ సినిమాలతో పాటు విక్రమ్ ప్రధాన పాత్రలో తీసి ఇటీవలే విడుదలైన తంగలాన్‌ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. చిత్ర యూనిట్‌ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సినిమా హిందీవర్షన్ గతవారం విడుదలైంది. ఈ సందర్భంగా  పా.రంజిత్‌  తన కొత్త సినిమా గురించి ప్రకటన చేశాడు. హిందీలో స్ట్రెయిట్‌ సినిమా కోసం స్క్రిప్ట్‌ సిద్ధం చేశానని, దానికి ‘బిర్సా ముండా’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించాడు.
ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలవబడే బిర్సా ముండా జార్ఖండ్ లోని రాంచీలో 1875 నవంబర్ 15న జన్మించాడు. బ్రిటిష్, స్వదేశీ భూస్వాముల బానిస సంకెళ్ళలో మగ్గుతున్న ఉన్న గిరిజన ప్రజల కోసం , వారి హక్కుల కోసం పోరాడారు.  గిరిజనుల సంస్కృతిని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరుడు బిర్సా ముండా. అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.  బ్రిటిష్ వారు ఆయన్ను అరెస్టు చేసి జైలులో పెట్టి విషప్రయోగం చేసి చంపారు. బిర్సా ముండా సేవలకు గుర్తింపుగా రాంచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు.
సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకొని వాటికి అందరూ మెచ్చేలా కమర్షియల్‌ పంథాలో సినిమా తీస్తారు. అందుకే ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తెరకెక్కించనున్న బిర్సా ముండా చిత్రం కూడా అదే కోవకు చెందినదిగా చెప్పవచ్చు. అయితే, ఇందులో నటించబోయే నటీనటుల పేర్లు ఆయన వెల్లడించలేదు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్