Saturday, April 20, 2024
Homeసినిమాపాగల్’ ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమను గురించి చెప్పే సినిమా: విష్వ‌క్ సేన్‌

పాగల్’ ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమను గురించి చెప్పే సినిమా: విష్వ‌క్ సేన్‌

విష్వ‌క్‌ సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘పాగ‌ల్‌’. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను విష్వ‌క్ సేన్ తండ్రి, ఫ‌ల‌క్‌నుమా దాస్ నిర్మాత రాజు విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా విష్వ‌క్ సేన్ మాట్లాడుతూ… ‘‘గత ఏడాది ‘హిట్’ సినిమా తర్వాత ప్రేక్షకులను కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు ‘పాగల్’ తో మీ ముందుకొస్తున్నాను. అంద‌రూ స‌పోర్ట్ చేస్తార‌ని భావిస్తున్నాం. చాలా రిస్కీ టైమ్‌.. నా సినిమా కంటే ముందు పెద్ద సినిమా ఏదీ రాలేదు, టిక్కెట్టు రేట్స్ విష‌యంలోనూ, ఇలా చాలా స‌మ‌స్య‌లున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో రిస్క్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నేను, బెక్కెం వేణుగోపాల్‌ గారు న‌మ్మి ఈ సినిమా పై రెండు రూపాయ‌లు రిస్క్ చేద్దామంటే, మా కంటే ఈ సినిమాను ఎక్కువ‌గా న‌మ్మిన దిల్‌రాజు గారు నాలుగు రూపాయ‌ల రిస్క్ చేశారు. అంద‌రం ప్రేమించి సినిమా చేశాం. ‘పాగల్’ ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు.. ప్రేమ గురించి చెప్పే క‌థ‌. ఇందులో స్ట్రాంగ్‌ గా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇందులో భూమిక‌ గారు నా అమ్మ పాత్ర‌ను చేశారు. చాలా మంది నన్ను ల‌వ్‌స్టోరీ చేయ‌మ‌ని అంటుంటే.. ఏకంగా ఐదు ల‌వ్‌స్టోరీస్ ఉండే సినిమాను చేశాను. అదే పాగ‌ల్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్స్‌లో క‌నిపించ‌ని ఓ హీరోయిన్ సినిమాలో మాత్రమే క‌నిపించ‌బోతుంది. ఆమె ఎవ‌రో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ… ‘పాగల్’ సినిమాను ఆగ‌స్ట్ 14న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌ల చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు బెంగుళూరు, చెన్నై, యు.ఎస్‌ల‌లో సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నారు. దాదాపు అన్ని సెంటర్లలో….దిల్‌రాజు గారు ఇచ్చిన ధైర్యంతో రిస్క్ అయినా సినిమాను థియేట‌ర్లలో రిలీజ్ చేస్తున్నాం. రాజు గారికి, శిరీష్‌ గారి స‌పోర్ట్ చాలా ఎక్కువ‌గా ఉంది. క‌థ విన్నతరువాత నుంచీ  విష్వ‌క్ సేన్‌ పూర్తి స‌పోర్ట్ అందిస్తూ వ‌చ్చాడు. త‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. అలాగే నివేథా పేతురాజ్, సిమ్రాన్‌, మేఘ‌లేఖ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. ఈ కార్య‌క్రమంలో హీరోయిన్స్ సిమ్రాన్ చౌద‌రి, మేఘ లేఖ, జ‌బ‌ర్దస్త్ రామ్ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్