Sunday, November 3, 2024
HomeTrending Newsపద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సత్యా నాదెళ్ల

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సత్యా నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని భారత కౌన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ ఆ అవార్డును నాదెళ్లకు అందజేశారు. పద్మభూషణ్‌ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. గత వారం అవార్డును అందజేసినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ రంగంలో భారత ప్రజలతో పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు నాదెళ్ల తెలిపారు.

వచ్చే జనవరిలో సత్యా నాదెళ్ల ఇండియాలో పర్యటించనున్నారు. నాదెళ్లకు భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మ భూషణ్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పురస్కారానికి ఎంపికైన 17 మందిలో ఆయన ఒకరు. కౌన్సుల్‌ జనరల్‌ నాగేంద్ర ప్రసాద్‌తో పలు అంశాలపై సత్యా నాదెళ్ల మాట్లాడారు. భారత సమగ్ర అభివృద్ధిలో డిజిటల్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని నాదెళ్ల తెలిపారు. టెక్నాలజీ రంగంలో భారత్‌ లీడర్‌గా ఎదిగేందుకు కావాల్సిన అన్ని అంశాలను ఆ ఇద్దరూ చర్చించుకున్నారు.

చరిత్రాత్మకమైన ఆర్థిక, సామాజిక, టెక్నాలజీ మార్పు జరిగే దశలో మనం ఉన్నామని, రాబోయే దశాబ్ధం డిజిటల్‌ టెక్నాలజీకి చెందుతుందని, భారత్‌లోని పరిశ్రమలు, సంస్థలు అన్నీ.. టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నాయని, ఇది గొప్ప ఆవిష్కరణకు దారి తీస్తుందని నాదెళ్ల అన్నారు. 2014లో మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. 2021 జూన్‌లో ఆయన చైర్మెన్‌ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్