Monday, May 20, 2024
Homeసినిమానేను చెప్పింది తప్పయితే పేరు మార్చుకుంటా : విష్వక్ సేన్

నేను చెప్పింది తప్పయితే పేరు మార్చుకుంటా : విష్వక్ సేన్

విష్వ‌క్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘పాగ‌ల్‌’.  నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ హీరోయిన్లుగా న‌టించారు. సినిమా ఆగ‌స్ట్ 14న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా థియేట‌ర్లలో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ… “ఈ సక్సెస్ మీట్‌లో నేను ఎక్కువగా మాట్లాడతాను. నేను మధ్యాహ్నం ఈ సినిమా చూశాను. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ మీట్ అంటున్నా. నేను నా లైఫ్‌లో చాలా మందిని లవ్ చేసా అంటారు కానీ.. దానికి క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా ? ముందు అందంగా ఉందో లేదో చూస్తారు. డబ్బును చూస్తారు. ఆ తర్వాత మన కులమా కాదా అని చూస్తారు. ఇలా.. చాలా లెక్కలు వేసుకుని ప్రేమిస్తారు కానీ.. ఇవేమి లేకుండా ప్రేమించే వాడే ప్రేమ్‌. తన తల్లి ప్రేమను వెతుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీనే ఈ పాగల్. ఈ సినిమాను దిల్ రాజు.. మేము.. 5లో తీద్దాం అనుకున్నాం కానీ.. రాజు గారు పది మెట్లు ఎక్కించారు. న‌రేశ్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ మూవీతో పెద్ద హిట్టు కొట్టబోతున్నాం. బెక్కం వేణుగోపాల్, డైరెక్ట‌ర్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. మాములుగా శుక్రవారం మూవీస్ రిలీజ్ చేస్తారు కానీ మేము పాగల్ కదా.. అందుకే నివారం రిలీజ్ చేస్తున్నాం.

ఆ రోజున పార్టీలు, పబ్‏లలోనే కాదు… థియేటర్లలో కూడా జ‌రుగుతాయి. చాలా మంది ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్టా అని అడుగుతున్నారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే. సర్కస్‏లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు కానీ.. నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. మూసిన థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేపిస్తా.. నేను చెప్పింది తప్పు అయితే.. నా పేరు మార్చుకుంటా. ఇండిపెండెన్స్ డే ఆగస్ట్‌ 15 కానీ.. సినిమా థియేట‌ర్లకు ఇండిపెండెన్స్ డే ఆగ‌స్ట్ 14” అన్నారు విష్వక్ సేన్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్