శ్రీలంకతో ఆదేశంలో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ ను పాక్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
410 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన లంక బ్యాటింగ్ లైనప్ ను పాక్ బౌలర్ నోమన్ అలీ తుత్తునియలు చేశాడు, ఏడు వికెట్లతో రాణించాడు. నషీమ్ షా మరో మూడు వికెట్లు తీశాడు దీనితో 188 పరుగులకే లంక కుప్పకూలింది. జట్టులో ఆంగ్లో మాథ్యూస్ -63 (నాటౌట్); కెప్టెన్ కరుణ రత్నే-41; నిశాన్ మధుశ్క-33 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 563 పరుగులతో నేటి ఆట మొదలు పెట్టిన పాకిస్తాన్ రిజ్వాన్ (50) అర్ధ సెంచరీ పూర్తి కాగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంకపై 410 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
డబుల్ సెంచరీ సాధించిన అబ్దుల్లా షఫీక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, ఆఘా సల్మాన్ కు ‘ప్లేయర్ అఫ్ డ సిరీస్’ లభించాయి.