PAK Rejects Indias Invitation :
ఇండియా నిర్వహించే జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి హాజరు కావటం లేదని పాకిస్తాన్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలపై దాని సరిహద్దు దేశాల భద్రతా సలహాదారుల సమావేశాన్ని ఇండియా వచ్చే వారం ఢిల్లీలో నిర్వహించనుంది. ఈ సమావేశానికి రష్యా, ఇరాన్, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్ దేశాలను భారత్ ఆహ్వానించింది. భారత్ నుంచి ఆహ్వానం వచ్చిందని దృవీకరించిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ సమావేశానికి వెళ్ళే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇస్లామాబాద్ లో ఈ రోజు ఉజ్బెకిస్తాన్ తో వివిధ భద్రత ఆంశాలపై సమావేశమైన పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ మోయీద్ యూసుఫ్ భారత్ వెళ్ళటం లేదని చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనకు పొరుగు దేశాలు గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించారు. మాస్కో ఫార్మాట్ మీట్ పేరుతో నిర్వహించిన సమావేశానికి భారత్, పాకిస్తాన్ లు హాజరయ్యాయి. అయితే ఈ సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు ఎడమొహం పెడమోహంగానే వ్యవహరించారు. ఇండియా, పాకిస్తాన్ దేశాలు చర్చలు జరిపితేనే ఆఫ్ఘన్ లో శాంతి నెలకొంటుందని ఆ సమావేశం తర్వాత రష్యా అభిప్రాయపడింది.
Must Read :తాలిబాన్ తో చర్చల ప్రసక్తే లేదు