Sunday, January 19, 2025
HomeTrending Newsపాకిస్తాన్ పై జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ పై జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని  ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి అన్నారు. అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్.. వాటిని ఏ ప్రాతిపదికన సమకూర్చుకుందో అని అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ విధానం పై లాస్ ఏంజిల్స్ లో జరిగిన కార్యక్రమంలో జో బిడెన్ వివిధ అంశాల్ని ప్రస్తావించారు. రష్యా సామ్రాజ్యవాదానికి ఉక్రెయిన్ బలి అవుతోందని అవేదన వ్యక్తం చేశారు. రష్యా, చైనాలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని జో బిడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కూడా ఇదే కోవకు చెందిన దేశమన్నారు.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ విధానాలపై అమెరికా అధ్యక్షుడు మండిపడ్డారు. జిన్ పింగ్ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని.. ఆ దేశ కంపనీల కుట్ర పూరిత పాలసీలు.. అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలను కుప్ప కులుస్తున్నాయన్నారు. రష్యా సామ్రాజ్య ధోరణితో ఆసియ ఖండంలో అశాంతి నెలకొందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కర్కశత్వానికి ఉక్రెయిన్ లో అమాయక పౌరులు బలవుతున్నారని, ఉక్రెయిన్ కు ప్రపంచ దేశాలు బాసటగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

పాకిస్తాన్ మీద అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు మరింత దిగజారే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ జావేద్ ఖమర్ బజ్వా అమెరికాలో ఇటీవలే పర్యటించారు. రెండు దేశాల దౌత్య సంబంధాల బలోపెతంపై చర్చించారు. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వ్యాఖ్యలు పాకిస్తాన్ కు శరాఘాతంగా మారాయి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్