Pakistan Politics : పాకిస్థాన్ తాజా మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ లో నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనబోమంటూ ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రధానిని ఎన్నుకునేందుకు నేషనల్ అసెంబ్లీ సమావేశం కావడానికి ముందే పీటీఐ సభ్యులంతా రాజీనామా చేశారు. ఈ దొంగల నడుమ కూర్చోవడం ఇష్టం లేదంటూ ఇమ్రాన్ కూడా నేషనల్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన పార్టీ సభ్యులంతా రాజీనామా చేయాలని ఆదేశించడంతో వారు అలాగే చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో రాజాకీయంగా అస్థిరత నెలకొనే ప్రమాదం ఉంది.
ప్రధానిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు పార్లమెంట్ లో అవిశ్వాసంలో ఓడిపోయాక ప్రజలందరూ నిరసన తెలపాలని కోరారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఇస్లామాబాద్ సహా అనేక పట్టణాల్లో ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రక్రియతో పాక్ లో అంతర్యుద్ధం తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Also Read : ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు