Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్Haris Rauf: తొలి టి 20లో పాక్ విజయం

Haris Rauf: తొలి టి 20లో పాక్ విజయం

న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతోన్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్ 88పరుగులతో ఘన విజయం సాధించింది. లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫఖర్ జమన్-47; సయీం అయూబ్ -47; ఫహీమ్ అష్రాఫ్-22, ఇమాద్ వసీమ్-16 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్హెన్రీ 3; మిల్నే, బెన్ లీస్టర్ చెరో రెండు; నీషమ్, ఇష్ సోది చెరో వికెట్ పడగొట్టారు.

కివీస్ 29 పరుగులకే మూడు కీలక వికెట్లు (చాద్ బోవ్స్-1; విల్ యంగ్-2; డెరిల్ మిచెల్-11) కోల్పోయింది. జట్టులో కాంప్ మాన్-34; టామ్ లాథమ్-20; జేమ్స్ నీషమ్-15 మాత్రమే రాణించారు. పాక్ బౌలింగ్ దెబ్బకు 15.3 ఓవర్లలో 94 పరుగులకే కివీస్ ఆలౌట్ అయ్యింది.

హారిస్ రాఫ్ నాలుగు వికెట్లు, ఇమాద్ వసీమ్ రెండు; షహీన్ అఫ్రిది, జమాన్ ఖాన్, ఫహీమ్, అష్రాఫ్ షాదాబ్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

హారిస్ రాఫ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

 ఐదు టి 20లు, ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular