Sunday, February 23, 2025
Homeసినిమాప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లో స్టైలిష్ గా గోపీచంద్

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లో స్టైలిష్ గా గోపీచంద్

Pakka Commercial Teaser Getting Positive Applause From Audience :

మ్యాచో హీరో గోపీచంద్ తో విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి రూపొందిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ -యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బ‌న్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా పక్కా కమర్షియల్ టీజర్ విడుదల చేశారు. “ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు…నేను ఎప్పుడో చూసి చేసి వదిలేశాను” అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కు ఒక అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. టీజర్ లోని ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనుంది.

Must Read : నవంబర్ 8న గోపీచంద్ ‘ప‌క్కా క‌మ‌ర్షియల్’ టీజ‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్