Thursday, March 28, 2024
Homeసినిమానవంబర్ 8న గోపీచంద్ ‘ప‌క్కా క‌మ‌ర్షియల్’ టీజ‌ర్

నవంబర్ 8న గోపీచంద్ ‘ప‌క్కా క‌మ‌ర్షియల్’ టీజ‌ర్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ సమర్పణలో  జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లపై మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. ఈ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ నిర్మాత బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ మారుతి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గోపీచంద్ – మారుతి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి  నుంచే ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అటు సాధ‌ర‌ణ ప్రేక్షకులతో పాటు ఇటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ స‌ర్కిల్స్ లో ఉత్కంఠ ఏర్పడింది. ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ ఫ‌స్ట్ లుక్ తో పాటు చిత్ర బృందం విడుద‌ల చేసిన త‌దిత‌ర ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్స్ కి క్రేజీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా పక్కా క‌మ‌ర్షియల్  టీజ‌ర్ విడుద‌లై సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దాదాపుగా 2 మిలియ‌న్ల వ్యూస్ అందుకున్న ఈ గ్లిమ్స్ న‌వంబర్ 8న రాబోతున్న ప‌క్కా క‌మ‌ర్షియల్ టీజ‌ర్ పై అంచ‌నాలు పెరిగేలా చేసింది. జీఏ2 పిక్చర్స్ – యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్లు వ‌రుస విజ‌యాల‌తో తెలుగు చిత్ర ప‌రిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలుగా  అంద‌రి మ‌న్ననలు  అందుకుంటున్నాయి. ఈ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, టాక్సీవాలా, ప్రతిరోజూ పండ‌గే వంటి సినిమాలు బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచాయి.

ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి కాంబినేష‌న్ లో రాబోతున్న ప‌క్కా క‌మ‌ర్షియాల్ పై భారీగా అంచ‌నాలు ఉన్నాయి.. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్, ఎడిటిర్ ఎస్ బి ఉద్భ‌వ్, ఎస్ కే ఎన్ స‌హ నిర్మాత‌, లైన్ ప్రొడ్యూస‌ర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ స‌త్య‌ గమిడి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్