Thursday, March 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సంకల్ప యాత్ర చరిత్రాత్మకం: ధర్మాన

సంకల్ప యాత్ర చరిత్రాత్మకం: ధర్మాన

Jagans Praja Sankalpa Padayatra Is A Historical One Says Ap Day Cm :

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని డిప్యూటి సిఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో సరిగ్గా నాలు గేళ్లు పూర్తయిన సందర్భంగా నరసన్నపేట జరిగిన ర్యాలీలో కృష్ణ దాస్ మాట్లాడారు.

ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం.. చరిత్రాత్మకం
  • మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకు రావాలన్న సంకల్పంతోనే జగన్ ఈ యాత్ర చేశారు
  • 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు.
  • అధికారంలోకి వచ్చిన తరువాత భారీ ఎత్తున సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు
  • అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
  • మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం కోసం బిల్లు రూపొందించి, కేంద్రానికి  పంపారు.
  • దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళ లకు అండగా నిలిచారు
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.
  • అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అన్ని కులాల వారు రాజకీయంగా ఎదగాలనేదే సీఎం జగన్ లక్ష్యం
  • సచివాలయ వ్యవస్థతో గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుల ముందు నిలిపారు.
  • అందుకే జనం జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారు.  ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మరథం పట్టారు.
  • పెట్రోలు డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు. ప్రజలకు మేలు జరిగే ప్రతి విషయంలోనూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి: చార్ ధాం యాత్రకు ఆరు నెలలు బ్రేక్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్