Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా`లో `మెయిల్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, కుడిఎడమైతే` వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు `అన్యాస్ టూటోరియ‌ల్` అనే స‌రికొత్త వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించ‌డానికి సిద్ధమైంది `ఆహా`. రెజీనా క‌సండ్ర‌, నివేదా స‌తీశ్‌, అగ‌స్త్య కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ప‌ల్ల‌వి గంగిరెడ్డి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సంస్థ ఆర్కా మీడియా బ్యాన‌ర్‌లో శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

అన్య అనే పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన సిరీస్ `అన్యాస్ టూటోరియ‌ల్`‌. అన్య ఓ పాపుల‌ర్ వెబ్ చానెల్‌ను న‌డుపుతుంటుంది. ఆమె ఇంట్లో ఆత్మ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాలు జ‌రిగిన‌ప్పుడు ఆమె జీవితం త‌ల‌కిందు ల‌వుతుంది. ఆమె దాన్ని త‌నకు అనుకూలంగా మార్చుకుందా లేక త‌గిన మూల్యం చెల్లించిందా? అనేది తెలియాలంటే అన్యాస్ టూటోరియ‌ల్ చూడాల్సిందేంటున్నారు యూనిట్‌. ఈ వారంలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్రేక్ష‌కుల ఆస‌క్తిన‌, ఉత్సాహాన్ని పెంచేలా ఈ సిరీస్ ఉంటుంద‌న్నారు నిర్మాతలు.

“ఈ షోతో ద‌ర్శ‌కురాలిగా పరిచ‌యం అవుతున్న ప‌ల్ల‌వి గంగిరెడ్డి ఆహా క్రియేటివ్ టీమ్‌లో స‌భ్యురాలు. ఈ షోతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తొలి ప్రాజెక్ట్ అన్యాస్ టూటోరియిల్‌ను ఆర్కా మీడియా సంస్థ‌లో చేయ‌డం విశేషం. ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని హార‌ర్ ఎలిమెంట్స్‌ను ఇందులో చూడొచ్చు. మేం ఏడాదిన్న‌ర‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా కంటెంట్‌ను అందిస్తున్నాం. దానికి ప్రేక్ష‌కులు నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. ఇప్ప‌టి వర‌కు ఆహా యాప్‌ను కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నార‌ని ఈ సంద‌ర్భంగా చెప్ప‌డానికి సంతోషిస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సరికొత్త పాత్ బ్రేకింగ్ కంటెంట్‌న్ఉ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం“ అని తెలిపారు ఆహా వ్య‌వ‌స్థాప‌కుడు అల్లు అర‌వింద్‌.

ద‌ర్శ‌కురాలు ప‌ల్ల‌వి గంగిరెడ్డి మాట్లాడుతూ… “అన్యాస్ టూటోరియ‌ల్ క‌థ‌ పై నేను, సౌమ్యా శ‌ర్మ వ‌ర్క్ చేశాం. ఈ ఆలోచ‌న‌ను అల్లు అర‌వింద్‌ గారు, శోభు యార్ల‌గ‌డ్డ గారికి చెప్పిన‌ప్పుడు వారికి న‌చ్చ‌డంతో మా ఆలోచ‌న రూపం పోసుకుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో మా క‌ల నిజ‌మైంది. రెజీనా, నివేదాల‌తో షోను చేయాల‌ని ముందుగానే అనుకున్నాం. త్వ‌ర‌లోనే ఈ క‌థ‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోష‌ప‌డుతున్నాం“ అన్నారు.

అక్టోబ‌ర్ నెల‌లో అన్యాస్ టూటోరియల్ షూటింగ్ పూర్తి చేస్తారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ ఏడాదిలో క్రిస్మ‌స్ వారాంతంలో విడుడ‌ద‌ల చేస్తారు. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ వ్య‌వ‌ధి ముప్పై నిమిషాలుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి క్రాక్‌, జాంబి రెడ్డి, నాంది, చావు క‌బురు చ‌ల్ల‌గా, సుల్తాన్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, అర్ధ శ‌తాబ్దం, కాలా, లుకా, షైలాక్‌, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, కుడిఎడ‌మైతే షోస్‌, సినిమాలు బెస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com