Tuesday, June 16, 2026
HomeసినిమాSankranti 2024: సంక్రాంతికి పోటీ మామూలుగా లేదుగా..

Sankranti 2024: సంక్రాంతికి పోటీ మామూలుగా లేదుగా..

సంక్రాంతి వస్తుందంటే.. సినిమాల పండగ వస్తుంది అంటారు. మామూలు టైమ్ లో సినిమాలు రిలీజ్ చేస్తే వచ్చే కలెక్షన్స్ కి, సంక్రాంతి టైమ్ లో రిలీజ్ చేస్తే వచ్చే కలెక్షన్స్ కి చాలా తేడా ఉంటుంది. సంక్రాంతి పండగ రోజున.. ఫ్యామిలీ అంతా సినిమా చూడాలనే మూడ్ లో ఉంటారు. అందుకనే సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు పోటీపడుతుంటాయి. ఈసారి ఈ పోటీ కాస్త ఎక్కువుగానే ఉంది. ఇప్పటికే నాగార్జున ‘నా సామి రంగ’, మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ సినిమా, తేజ సజ్జ ‘హనుమాన్’ పోటీలో ఉన్నాయి.

దీంతో సంక్రాంతికి భారీగా పోటీ ఏర్పడడంతో రిలీజ్ డేట్స్ విషయంలో ఎప్పుడు ఏ సినిమా వస్తుందో క్లారిటీ లేదు. ఈ సినిమాలే కాకుండా వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాలతోనే భారీగా పోటీ ఏర్పడింది అనుకుంటే.. డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. శివ కార్తికేయన్ అయలాన్ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని అనౌన్స్ చేయడం విశేషం.

రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ లాల్ సలామ్. విష్ణు విశాల్, విక్రాంత్ ఇందులో హీరోలు. ఐశ్వర్య రజినీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఈ సంక్రాంతికి ఎన్నడూ లేనంతగా భారీ చిత్రాలు రాబోతున్నాయి. దీంతో ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనేది ఆసక్తిగా మారింది. అలాగే ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తామని ప్రకటించిన సినిమాల్లో కొన్ని పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి.. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయి..? ఆ సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడు..? అనేది క్లారిటీ రావాల్సింది. మొత్తానికి ఈ సంక్రాంతికి పోటీ మామూలుగా లేదుగా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular