Sunday, January 19, 2025
Homeసినిమాడిసెంబర్ 9న 'పంచతంత్రం' విడుదల

డిసెంబర్ 9న ‘పంచతంత్రం’ విడుదల

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. “పంచతంత్రం” సినిమాను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో ‘పంచతంత్రం’ అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తూ మొదలవుతుంది. తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడవడం మనం చూస్తాము. హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజశేఖర్‌ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా కనిపిస్తున్నారు. ఆతర్వాత దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్‌లో ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి.

చిత్ర నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. మేము ఇంతకు ముందు విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద అందరూ చాలా బాగా నటించారు. నటీ నటులు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్