Friday, March 29, 2024
Homeసినిమాఅక్టోబర్ 15న రిషబ్ శెట్టి “కాంతారా” విడుదల

అక్టోబర్ 15న రిషబ్ శెట్టి “కాంతారా” విడుదల

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన  సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ తో  ‘నిన్నిండలే’… ఆ తర్వాత యశ్ తో ‘మాస్టర్ పీస్’….. మూడో సినిమాగా పునీత్ తోనే ‘రాజకుమార’ ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది.  ఆ తర్వాతా కేజీఎఫ్ రెండు చాప్టర్లుగా నిర్మించింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్, రిషబ్ షెట్టి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కాంతారా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “కాంతారా” సినిమాను రిలీజ్ చేయనున్నారు.”కాంతారా” అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాణాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి నటనే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్