Sunday, January 19, 2025
Homeసినిమా‘అంటే సుందరానికి’ నుంచి ‘పంచెకట్టు’ పాట విడుదల

‘అంటే సుందరానికి’ నుంచి ‘పంచెకట్టు’ పాట విడుదల

Panchakattu: నేచురల్ స్టార్ నాని హీరో గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి‘ చిత్రం జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్-పంచెకట్టు పాటని విడుదల చేశారు. వివేక్ సాగర్ ఈ పాట కోసం ఓ క్యాచి ట్యూన్ కంపోజ్ చేశారు. హసిత్ గోలీ రాసిన లిరిక్స్ కూడా ట్రెండీ ఉంటూ వినగానే హుషారు గా డ్యాన్స్ చేసేలా ఈ పాటని స్వరపరిచారు.

లెజెండరీ కర్ణాటిక్ క్లాసికల్ గాయని అరుణా సాయిరామ్ ఈ పాటని ఆలపించడం అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఈ ఫస్ట్ సింగిల్ లో సుందరం క్యారెక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. పాటలో నాని బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంది. ఈ పాటలో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ తో సహా అమెరికాలోని పాపులర్ ప్రదేశాల చుట్టూ తిరుగుతూ కనిపించారు నాని. ఈ పాట ఇన్స్టంట్ హిట్ కావడంతో సుందరం సంగీత ప్రయాణం అద్భుతంగా ప్రారంభమైనట్లయింది.

ఈ చిత్రంలో నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటించడంతో పాటు ఈ సినిమా తోనే ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేయడం మరో విశేషం. ఈ సినిమాలో నజ్రియా, లీలా థామస్ అనే పాత్రలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Also Read : ‘అంటే సుందరానికి’ లో నజ్రియా ఫహద్ లుక్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్