Friday, March 29, 2024
Homeసినిమావిజ‌య్, స‌మంత మూవీ సెట్స్ పైకి ఎప్పుడు?

విజ‌య్, స‌మంత మూవీ సెట్స్ పైకి ఎప్పుడు?

When: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. పూరి డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఆగ‌ష్టు 25న లైగ‌ర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే.. ఇటీవ‌లే విజ‌య్-పూరి కాంబినేషన్ లో రెండో సినిమా జ‌న‌గ‌ణ‌మ‌న స్టార్ట్ చేశారు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఆగ‌ష్టు 3న రిలీజ్ అంటూ ప్ర‌క‌టించ‌డం కూడా జ‌రిగింది.

ఇదిలా ఉంటే ‘నిన్నుకోరి’, ‘మ‌జిలీ’ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌తో విజయ్ సినిమా చేయ‌నున్న‌ట్టుగా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాను ప్ర‌క‌టించ‌డంతో శివ నిర్వాణ‌తో విజ‌య్ సినిమా జ‌న‌గ‌ణ‌మ‌న త‌ర్వాత ఉంటుందా? జ‌న‌గ‌ణ‌మ‌న కంటే ముందు ఉంటుందా? అనేది ఆస‌క్తిగా మారింది. తాజా వార్త ఏంటంటే.. శివ నిర్వాణ‌తో చేయ‌నున్న మూవీని ఈ నెల‌లోనే స్టార్ట్ చేయ‌నున్నారు.

ఈ నెల‌లో 27 రోజులు షూటింగ్ చేయ‌నున్నారు. కాశ్మీర్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాశ్మీర్ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం, కేర‌ళ‌లో షూటింగ్ చేయ‌నున్నారని స‌మాచారం. ఈ క్రేజీ మూవీకి యువ సంగీత సంచ‌ల‌నం అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ట‌క్ జ‌గ‌దీష్ సినిమాతో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన శివ నిర్వాణ ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నాడు. మ‌రి.. విజ‌య్, శివ నిర్వాణ క‌లిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read :లైగ‌ర్ కాంబినేష‌న్ రిపీట్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్