Monday, June 15, 2026
Homeసినిమాబన్నీతో పరశురామ్ మూవీ నిజమేనా..?

బన్నీతో పరశురామ్ మూవీ నిజమేనా..?

యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నారు పరశురామ్. ఆతర్వాత ‘ఆంజనేయుడు’, ‘సారొచ్చారు’ సినిమాలు చేసిన పరశురామ్ గీతా ఆర్ట్స్ సంస్థలో ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘గీత గోవిందం’ చిత్రాలు తెరకెక్కించారు. గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ సాధించడంతో పరశురామ్ కు భారీ ఆఫర్స్ వచ్చాయి. నాగచైతన్యతో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించినప్పటికీ.. మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యింది కానీ.. బ్లాక్ బస్టర్ సాధించలేకపోయింది.

ఈ మూవీ తర్వాత నాగచైతన్యతో మూవీ చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరలేదు. ఇటీవల విజయ్ దేవరకొండతో సినిమాని దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్నట్టుగా ప్రకటించి అల్లు అరవింద్ కి షాక్ ఇచ్చాడు. కారణం ఏంటంటే.. పరశురామ్ తో అల్లు అరవింద్ ‘గీత గోవిందం 2’ చేయాలి అనుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడంతో అల్లు అరవింద్ కి కోపం రావడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అల్లు అరవింద్ కోపాన్ని తగ్గించే ప్రయత్నాన్ని పరశురామ్ చేస్తున్నాడని.. ముందుగా కోలీవుడ్ స్టార్ కార్తీతో సినిమా చేసి ఆతర్వాత విజయ్ తో మూవీ తెరకెక్కిస్తాడని.. ప్రస్తుతానికి విజయ్ మూవీని పక్కనపెట్టాడని టాక్.

ఇదిలా ఉంటే.. పరశురామ్ ఎప్పటి నుంచో బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు కానీ.. కుదరడం లేదు. పుష్ప 2 త‌ర్వాత ప‌ర‌శురామ్ సినిమా ఉంటుంద‌న్న టాక్ వినిపిస్తుంది. అయితే.. వీటిలో ఏమాత్రం నిజం లేదని తెలిసింది. గీతా ఆర్ట్స్‌కి ప‌ర‌శురామ్ ఓ సినిమా చేయాలి. విజ‌య్‌తోనే ఆ సినిమా ఉండాల్సింది కానీ అనూహ్యంగా.. ఆ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లింది. అయితే.. పరశురామ్ చేసిన పని వలన అల్లు అరవింద్ కి కోపం రావడంతో అసలు గీతా సంస్థలో పరశురామ్ సినిమా ఉంటుందా..? ఉండదా..? అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular