Tuesday, January 21, 2025
Homeసినిమాప‌ర‌శురామ్ పై చైత‌న్య‌కు కోపం లేదా?

ప‌ర‌శురామ్ పై చైత‌న్య‌కు కోపం లేదా?

Chaitu-Parashuram: గీత గోవిందం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్. ఈ సినిమా త‌ర్వాత ప‌ర‌శురామ్ నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయాలనుకున్నారు. అనుకోవ‌డ‌మే కాదు.. నాగ‌చైత‌న్య‌కు క‌థ చెప్ప‌డం.. ఆ క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం.. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. అయితే.. ఇక సెట్స్ పైకి వెళ్ల‌డ‌మే ఆల‌స్యం అనుకుంటుంటే.. ప‌ర‌శురామ్ కి మ‌హేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వ‌చ్చింది.అంతే.. త‌న డ్రీమ్ మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌డమ‌ని.. నాగ‌చైత‌న్య‌తో చెప్పి.. మ‌హేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ మొదలుపెట్టాడు పరశురామ్. ఈ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ  సినిమా  ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ.. తదుపరి సినిమాను నాగ చైతన్యతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తమ ఇద్దరి కాంబో సినిమాను 14 రీల్స్ బ్యానర్ నిర్మించబోతున్నట్లుగా కూడా వెల్లడించారు.

తన సినిమా ను అనౌన్స్ చేసి పక్కన పెట్టేస్తే ఏ హీరోకి అయినా కోపం వస్తుంది. మహేష్ బాబు తో సినిమా కోసం తనను పక్కన పెట్టాడు అనే కోపాన్ని పరశురామ్ పై నాగ చైతన్య చూపించకుండా తర్వాత చేసేందుకు ఒప్పుకోవడం అనేది ఆయన మంచితనం కు నిదర్శనం అంటూ అభిమానులు చైత‌న్య‌ను అభినందిస్తున్నారు. మ‌రి.. చైత‌న్య‌ను ప‌ర‌శురామ్ ఎలా చూపిస్తాడో చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్