Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Naga Chaitanya-Nandini: అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం థ్యాంక్యూ అనే మూవీ చేస్తున్నారు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య‌తో నందినీ రెడ్డి ఓ సినిమా చేయ‌నుంద‌ని గతంలో వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత నందినీ రెడ్డితో నాగ‌చైత‌న్య‌ సినిమా క‌న్ ఫ‌ర్మ్ కాలేద‌ని.. ఈ సినిమా లేద‌ని కూడా ప్ర‌చారం జరిగింది.

తాజా వార్త ఏంటంటే.. నందినీ రెడ్డి చెప్పిన స్టోరీకి నాగ‌చైత‌న్య ఓకే చెప్పార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ క‌థ‌ను నందినీ రెడ్డి, బి.వి.ఎస్.ర‌వి క‌లిసి రాశార‌ని.. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. అయితే.. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే.. ప్ర‌స్తుతానికి ఇంకా క్లారిటీ లేద‌ని చెప్ప‌చ్చు. కార‌ణం ఏంటంటే.. థ్యాంక్యూ మూవీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌.. వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో మూవీ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత‌ ప‌ర‌శురామ్ తో ఓ సినిమా చేయాల్సివుంది. అందుచేత నందినీ రెడ్డితో సినిమా ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : నాగ‌చైత‌న్య స‌రికొత్త రికార్డ్.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com