Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెద్దోళ్ల సినిమా కష్టాలు

పెద్దోళ్ల సినిమా కష్టాలు

Delhi based businessman fakes poverty to get child admitted under EWS quota

జీవితాలనుంచి సినిమాకథలు పుడతాయా? సినిమాలు చూసి జీవితాలు మారుతున్నాయా? ఏమో! ఇది ఎప్పటికీ సందేహమే. ఈ సందేహానికి దారితీసిన సంఘటన వివరాలు…

ఢిల్లీలో అదో ప్రతిష్ఠాత్మక పాఠశాల. గొప్పవాళ్ళ పిల్లలందరూ చదువుతుంటారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు(ఈ డబ్ల్యూ ఎస్) కొంత కోటా ఉంటుంది. దానికీ చాలా పోటీ. తన పిల్లవాడిని ఎలాగైనా ఆ స్కూల్ లోనే చదివించాలనుకున్నాడు ఓ డబ్బున్న మారాజు. అందుకోసం పేదవాడిగా అవతారమెత్తాడు.

తన పేరు మార్చుకున్నాడు. పిల్లాడి పేరు మార్చాడు. తప్పుడు ఆదాయ పత్రాలు లెక్కలన్నీ సరిగానే చేశాడు. అనుకున్నట్టే అతని కొడుక్కి సీట్ వచ్చింది. రోజూ స్కూలుకి వచ్చేప్పుడు వెళ్ళేటపుడు స్కూటర్ పైన తీసుకెళ్ళేవాడు. కాస్తదూరమే. అక్కడ తన కారులోకి మారేవాడు.పేరు మార్చుకోడం ఇష్టం లేని పిల్లవాడు స్కూల్ లో అందరికీ తన అసలు పేరు చెప్పాడు. ఈ విషయం స్కూల్ అధికారులకు తెలిసి విచారించారు. అసలు నిజం బయటపడింది. పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షరూపాయలు కట్టి బెయిలు తెచ్చుకున్నాడు.

Delhi’s wealthiest buy poverty papers to get their children into top schools

సీన్ కట్ చేస్తే …
నాలుగేళ్ళ క్రితం “హిందీమీడియం” అనే సినిమా వచ్చింది. ఇంగ్లీష్ రాని డబ్బున్న తల్లిదండ్రులు తమ పిల్లని ఎలాగైనా పేరున్న పాఠశాలలో చేర్చాలని పేదవారిగా నాటకమాడి పేదవారి కోటాలో సీట్ సాధించడం ఇతివృత్తం. ఇర్ఫాన్ఖాన్ అద్భుతంగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా “ఇంగ్లీష్ మీడియం” అనే సినిమా కూడా వచ్చింది.

మళ్ళీ సీన్ కట్ చేస్తే…
ఒక డబ్బున్న ఆసామీ తన పిల్లోడిని పేదవాడిగా గొప్ప స్కూల్ లో చేర్చాడు. ఐదేళ్లు అంతా బాగానే ఉంది. పిల్లవాడు మూడో క్లాస్ కి వచ్చాడు. ఇంతలో రెండో కొడుక్కి స్కూల్ కెళ్లే వయసు వచ్చింది. తండ్రి ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి మెరుగైందని, తన కొడుకుని జనరల్ కేటగిరీ లోకి మార్చి రెండో కొడుక్కి సీట్ ఇవ్వమని అభ్యర్ధించాడు. దాంతో అనుమానం వచ్చి స్కూల్(సంస్కృతి) వారు విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. తండ్రి నిర్వాకానికి కొడుకుని కూడా బయటకు పంపారు.

పేదవారి సీట్లను ఇలా దోచుకుంటున్నారని అప్పట్లో ధర్నాలు కూడా జరిగాయి.
ఇంత జరిగాక కూడా మళ్ళీ అదే జరిగింది. బలహీనవర్గాల కలలు కూడా దోచుకునే ఇటువంటి దొరలు ఎందరో!
ఎక్కడుంది లోపం?

-కె. శోభ

Also Read:

అమరత్వం కోసం కుబేరుల ఆరాటం

Also Read:

సానుకూల దృక్పథానికి…

Also Read:

చదువు చట్టుబండలు కాకూడదంటే

RELATED ARTICLES

Most Popular

న్యూస్