Friday, June 12, 2026
Homeసినిమా'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన 'పారిజాత పర్వం'

‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన ‘పారిజాత పర్వం’

చైతన్యరావు హీరోగా వైవిధ్యభరితమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ సినిమాల్లో హిట్లూ ఉన్నాయి .. ఫ్లాపులూ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాతోను ఆయన తన మార్క్ చూపిస్తూ వెళుతున్నాడు. ఒకప్పుడు జంధ్యాల దర్శకత్వంలో ప్రదీప్ ఈ తరహా పాత్రలను పోషిస్తూ వచ్చాడు. మళ్లీ ఇంతకాలానికి ఆ రూట్లో వెళుతున్న కథానాయకుడిగా చైతన్యరావు కనిపిస్తున్నాడు. అలా ఆ మధ్య ఆయన చేసిన సినిమానే ‘పారిజాత పర్వం’.

చైతన్యరావు – మాళవిక సతీషన్ జంటగా నటించిన ఈ సినిమాలో, సునీల్ కీలకమైన పాత్రను పోషించాడు. మహీధర్ రెడ్డి – దేవేశ్ నిర్మించిన ఈ సినిమాకి, సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వలన, ఈ సినిమా వచ్చిపోయిన విషయం కూడా ఎవరికీ తెలియదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాలో హీరోకి సినిమా డైరెక్షన్ పై ఆసక్తి ఎక్కువ. తన స్నేహితుడిని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనుకుంటాడు. ఆ ప్రాజెక్టును చేయడం కోసం నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అనేది కథ. అక్కడక్కడా కామెడీ టచ్ తో కూడిన ఒకటి రెండు ఎపిసోడ్స్ కాస్త నవ్విస్తాయి. మొత్తంగా చూసుకుంటే, కథాకథనాలు చాలా నిదానంగా నడుస్తాయి. ఓటీటీ ఆడియన్స్ కి ఏమనిపిస్తుందనేది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular