Monday, January 20, 2025
HomeTrending Newsఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఈనెల 31 నుంచి ఏప్రిల్​ 8 వరకు జరగనున్నాయి. పార్లమెంట్​ వ్యవహారాల కేబినెట్​ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిరోజు ఉభయసభల్లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించనున్నారు.  ఈ సమావేశాల తొలి అర్ధభాగం ఫిబ్రవరి 11న ముగియనుంది. నెల రోజుల విరామం తర్వాత మార్చి 14న తిరిగి ప్రారంభమై.. ఏప్రిల్​ 8 వరకు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్