పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై జరిగే సమావేశాలకు శాఖ పరంగా అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని ఆయన వెల్లడించారు.
ఉభయ సభల సభ్యులు, పార్లమెంట్ సిబ్బందికి జూలై లోపు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఉభయ సభల సమయం, ఎన్ని రోజులు సెషన్స్ నడపాలనేది కోవిడ్ పరిస్థుతులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
కరోన తీవ్రత దృష్ట్యా పోయిన ఏడాది వర్షాకాల సమావేశాలు జూలై లో జరగాల్సినవి సెప్టెంబర్ లో నిర్వహించారు. కరోన మహమ్మారి విలయ తాండవంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు.