Sunday, November 24, 2024
HomeTrending Newsడిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల​ సమావేశాలు

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల​ సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 తేదీ వరకు జరగనున్నాయి. లోక్​సభ, రాజ్యసభ సచివాలయాలు ఈమేరకు నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం మీద ఈసారి శీతాకాల సమావేశాలు.. 17 రోజుల పాటు జరగనున్నాయి. “2022 పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్​ 7 నుంచి 29 వరకు జరుగుతాయి. 23 రోజుల వ్యవధిలో 17 సిట్టింగ్స్​ ఉంటాయి. వివిధ అంశాలపై చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాము. నిర్ణయాత్మక చర్చలు సాగుతాయని ఆశిస్తున్నాము,” అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి ట్వీట్​ చేశారు.

పలువురు సిట్టింగ్​ ఎంపీల మృతిపై సంతాపం తెలుపుతూ.. తొలి రోజు కార్యకలాపాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన సిట్టింగ్​ ఎంపీల్లో ఎస్​పీ దిగ్గజ నేత ములాయం సింగ్​ యాదవ్ కూడా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్