Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో బెంగాల్- ఢిల్లీ మధ్య మ్యాచ్ టై కాగా, పూణేపై పాట్నా ఘన విజయం సాధించింది.
బెంగాల్ వారియర్స్ – దబాంగ్ ఢిల్లీ మధ్య హోరాహోరీగా జరిగిన మొదటి మ్యాచ్ 39-39తో డ్రా గా ముగిసింది. యూపీ విజయం సాధించింది. ఆట మొదటి భాగంలో ఢిల్లీ 19-18తో స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. రెండో భాగంలో బెంగాల్ 21-20తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ సమయం ముగిసే నాటికి ఇరు జట్లూ సమంగా నిలిచాయి. బెంగాల్ కెప్టెన్ మణీందర్; ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు సాధించడం విశేషం.
పాట్నా పైరేట్స్ – పునేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 43-26తో పాట్నా ఘన విజయం సాధించింది. ఆట తొలి భాగంలో 18-17 తో కేవలం ఒక్క పాయింట్ ఆధిక్యం మాత్రమే సంపాదించిన పాట్నా రెండో భాగంలో జూలు విదిల్చి ఆడి 25-9తో తిరుగులేని పైచేయి సాధించింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 17 పాయింట్ల భారీ తేడాతో పాట్నా విజయం సొంతం చేసుకుంది. పాట్నా రైడర్ గుమన్ సింగ్ 13 పాయింట్లతో రాణించాడు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (70 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (60); హర్యానా స్టీలర్స్(58); బెంగుళూరు బుల్స్ (55); యూపీ యోధ (52); జైపూర్ పింక్ పాంథర్స్ (51) టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: యూపీ, గుజరాత్ విజయం