Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: తలైవాస్ పై పాట్నా ఘనవిజయం

ప్రొ కబడ్డీ: తలైవాస్ పై పాట్నా ఘనవిజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో పాట్నా పైరేట్స్– తమిళ్ తలైవాస్ మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో 52-24తో పాట్నా ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 21-12తో ఆధిక్యం సంపాదించిన పాట్నా ద్వితీయార్ధంలో మరింత మెరుగ్గా రాణించి తలైవాస్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి 31-12తో దూసుకు పోయింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి  28 పాయింట్ల భారీ తేడాతో అపూర్వ విజయం దక్కించుకుంది.

పాట్నా ఆటగాళ్ళు మను గయత్-9;  ప్రశాంత్ కుమార్-8; సచిన్-6; నీరజ్ కుమార్-6, మొహమ్మడ్రేజా-6 పాయింట్లతో సమిష్టిగా రాణించారు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… బెంగుళూరు బుల్స్ (46 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (45); దబాంగ్ ఢిల్లీ (43); హర్యానా స్టీలర్స్ (42); యూ ముంబా (41); బెంగాల్ వారియర్స్ (41); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: యూపీపై పూణే విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్