Saturday, June 13, 2026
Homeసినిమాపవన్ - సుజిత్ మూవీ ప్రారంభం

పవన్ – సుజిత్ మూవీ ప్రారంభం

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో మూవీని ఈ రోజు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ‘og’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. og అంటే ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్ధం అని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్‌ బాబు, కోన వెంకట్ తదితరులు పాల్గొని టీమ్ కి అభినందనలు తెలియచేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. వీరమల్లు షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియదు. ‘వినోదయ సీతం’ రీమేక్ స్టార్ట్ కావాల్సివుంది. ఇలా.. ఇన్ని ప్రాజెక్టులు లైన్ లో ఉండగా ఈ రోజు పవన్ కళ్యాణ్‌.. సుజిత్ తో మూవీని స్టార్ట్ చేయడం విశేషం. మరి.. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో…? ఎప్పుడు రిలీజ్ అవుతాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular