Sunday, January 19, 2025
Homeసినిమాపుకార్ల‌కు చెక్ పెట్టిన ప‌వ‌ర్ స్టార్

పుకార్ల‌కు చెక్ పెట్టిన ప‌వ‌ర్ స్టార్

Bhagath Singh soon: ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్‌, గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హరీష్‌ శంకర్ కాంబినేషన్ అనౌన్స్ చేసిన భారీ చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్‘. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తోన్న ఈ సినిమా ప్ర‌క‌టించి చాలా రోజులైనా ఇంకా సెట్స్ పైకి రాక‌పోవ‌డంతో చాలా పుకార్లు వ‌చ్చాయి. పవన్ ఈ సినిమాను మరోసారి వాయిదా వేశాడని కొందరు, ఏకంగా సినిమాను పక్కనపెట్టాడని మరికొందరు, అసలు హరీష్ శంక‌ర్ దగ్గర పూర్తిస్థాయి క‌థ‌ లేదని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపించారు.

అయితే.. ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన పవన్ క‌ళ్యాణ్‌.. హరీష్ శంకర్ తో తను చేయాల్సిన సినిమా ఉందని స్పష్టం చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్  పై హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను త్వరలోనే చేయబోతున్నానని పవన్ క‌ళ్యాణ్‌ స్వయంగా ఎనౌన్స్ చేశారు. పవన్ ప్రకటనతో ఈ సినిమాపై ఇన్నాళ్లు షికారు చేసిన పుకార్లు ఆగిపోయాయి.

ఈ సినిమా గురించి ఇంకొక్క క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. అది ఏంటంటే… ఈ ప్రాజెక్టు నుంచి హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. వాటి పై కూడా స్పష్టత వచ్చేస్తే, ప్రాజెక్టుపై ఇక ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ ఉండవు. అయితే… ప‌వ‌న్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : భ‌వ‌దీయుడు… డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్