Thursday, April 25, 2024
HomeTrending Newsరాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్

రాజ్యసభ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరహాలో ఉత్కంఠకు కారణమయ్యాయి. కాంగ్రెస్ – బీజేపీ మధ్య హోరా హోరీగా సాగాయి. వరుస ఫిర్యాదులతో పోలింగ్ ముగిసినా.. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయింది. రాజస్థాన్ లో ఇద్దరు బీజేపీ సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు పోలింగ్​ ప్రశాంతంగా ముగిశాయి. కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్​ జరగింది. అనంతరం జరిగిన కౌంటింగ్ లో మూడు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది.

బీజేపీ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, ప్రముఖ నటుడు, రాజకీయ నేత జగ్గేశ్​, మాజీ ఎంఎల్​సీ లెహర్​ సింగ్​ సిరోయాలు గెలుపొందారు. కాంగ్రెస్​ తరఫున బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్​ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే విధంగా.. రాజస్థాన్​లో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్​ జరగగా.. మూడింట అధికార కాంగ్రెస్​ పార్టీ గెలుపొందింది. భాజపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ అభ్యర్థులు రణ్​దీప్​ సుర్జేవాలా, ముకుల్​ వాస్నిక్​, ప్రమోద్​ తివారీలు ఎన్నికైనట్లు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ట్వీట్ చేశారు. భాజపా తరఫున బరిలో దిగిన మాజీ మంత్రి ఘనశ్యామ్​ తివారీ విజయం సాధించారు.

హర్యానాలో కాంగ్రెస్ కు షాక్ తప్పలేదు. ఒక సీటు కోల్పోయింది. మరో సీటును స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగిన కార్తికేయ శర్మ గెలుచుకున్నారు. మహారాష్ట్రలో అధికార కూటమికి షాక్ తప్పలేదు. మహారాష్ట్రలో మొత్తం ఆరు స్థానాలకు పోలింగ్ జరగ్గా అధికార కూటమికి నాలుగు స్థానాలు..బీజేపీ రెండు స్థానాలు దక్కించుకొనే బలం ఉంది. కానీ, ఇక్కడ అధికార కూటమికి షాక్ ఇచ్చేలా బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. కాగా, అధికార శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి మూడు స్థానాలు గెలుచుకుంది. హర్యానాలో అజయ్ మాకెన్ గెలవకపోవటం కాంగ్రెస్ కు నష్టంగా మారింది. దీంతో..మహారాష్ట్రలో అధికార కూటమి 3, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. రాజస్థానంలో కాంగ్రెస్ 3, బీజేపీ 1 స్థానంలో గెలిచాయి.

కర్ణాటకలో నాలుగు స్థానాల్లో బీజేపీ 3 సీట్లు..కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకుంది. హర్యానాలో బీజేపీ సొంత ఒక సీటు.. కమలనాధులు మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. క్రాస్ ఓటింగ్.. ఫిర్యాదుల నడుమ ఫలితాల ప్రక్రియ కొంత సేపు నిలిచిపోయింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రకటన విడుదల అయిన నేపథ్యంలో ఈ ఫలితాలు జాతీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి.

Also Read రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్