Friday, March 29, 2024
HomeTrending Newsఏదైనా మాట్లాడితే అర్ధం ఉండాలి: బొత్స

ఏదైనా మాట్లాడితే అర్ధం ఉండాలి: బొత్స

‘నీ మీద ప్రధానమంత్రికి కంప్లయింట్ ఇవ్వడానికి నువ్వేమైనా పుడింగి అనుకుంటున్నావా’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ‘నువ్వు ఏం సాధిస్తావని నీ మీద మేము చెప్పాలి, మీకు మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు’ అంటూ మండిపడ్డారు. నిన్నటి విజయనగరం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  పవన్ కళ్యాణ్ ది ఒక రాజకీయ పార్టీ అని తాము భావించడంలేదని, ఓ సెలెబ్రిటీ పార్టీ అని, పవన్ తీరు… ఒకరితో పొత్తు, మరొకరితో కాపురం అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ తాము ఖర్చు చేసిందే షుమారు 15వేల కోట్ల రూపాయలు ఉంటుందని, కానీ ఈ పథకంలో 15 వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ  సెలెబ్రిటీ పార్టీ నేత పవన్ కళ్యాణ్ చెప్పడం విచిత్రంగా ఉందని, అంటే ఖర్చు చేసిన మొత్తం అవినీతి జరిగినట్లేనా అంటూ నిలదీశారు. ఏదైనా మాట్లాడితే దానికో అర్ధం ఉండాలని, సెలెబ్రిటీ కాబట్టి చూడడానికి ప్రజలు వస్తారని, అంత మాత్రాన ఏది పడితే అది తమపై మాట్లాడడం సరికాదని, సిల్క్ స్మిత వస్తే ఇంతకంటే ఎక్కువమంది మంది అప్పట్లో వచ్చేవారని బొత్స ఎద్దేవా చేశారు. పవన్ ఏమైనా యుగ పురుషుడా…. నిన్న పవన్ వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా వచ్చి తమకు అన్యాయం జరిగిందని ఆయన వద్దకు వచ్చి చెప్పారా అని ప్రశ్నించారు. గతంలో ప్యాకేజ్ స్టార్ అంటున్నారని ఆయనకు ఎంతో ఆగ్రహం వచ్చిందని, ఇష్టమొచ్చినట్లు తమపై మాట్లాడారని, ఇప్పుడు ఆయన తమపై ఏం మాట్లాడారో ఆలోచించుకోవాలని హితవు పలికారు.

రాష్ట్రంలో ప్రతి పేదవాడు తలెత్తుకు తిరగాలన్న లక్ష్యంతో… తనకూ ఓ ఆస్తి, ఇల్లు ఉందని చెప్పుకోవాలన్న లక్ష్యంతోనే గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నామని బొత్స వివరించారు. గతంలో వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత శాచురేషన్ పద్ధతిలో ఇళ్ళ నిర్మాణం చేపట్టారని, మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మరిన్ని అడుగులు ముందుకు వేసి ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ… రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్